Shreyas Iyer 87 Runs vs MI Qualifier 2 IPL 2025 | ఒక్క ఇన్నింగ్స్ తో 11ఏళ్ల పంజాబ్ రాత మార్చేశాడు
ఒక్క ఇన్నింగ్స్ తో 11 ఏళ్ల పంజాబ్ రాత మార్చేశాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. వర్షం కారణంగా అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్ పై 204 పరుగులను ఛేజ్ చేసే క్రమంలో వికెట్లు పడుతున్నా అసలు ఏమాత్రం తొట్రుపాటు లేకుండా ఆడాడు అయ్యర్. ఎవడున్నా లేకపోయినా నా ఆట నేను ఆడేస్తానన్నట్లు చెలరేగిన అయ్యర్ 41 బంతుల్లోనే 5 ఫోర్లు 8 సిక్సర్లతో 87పరుగులు చేశాడు. బుమ్రాను మాత్రమే తెలివిగా ఆడిన అయ్యర్..తన బౌలింగ్ లో స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ..మిగిలిన ముంబై బౌలర్లపై మాత్రం మూర్ఖంగా విరుచుకుపడ్డాడు. స్టార్టింగ్ లో కుదురుకునేందుకు మంచిగానే టైమ్ తీసుకున్న అయ్యర్...వన్స్ సెట్ అయిన తర్వాత మరణ తాండవం ఆడేశాడు. రీస్ టోప్లే ని ఒకే ఓవర్ లో మూడు సిక్సర్లు బాది మాస్ ఊచకోత మొదలుపెట్టిన అయ్యర్ అశ్వనీ కుమార్ అనే పిల్ల బౌలర్ ను టార్గెట్ చేసి చావబాదాడు. బౌల్ట్ బౌలింగ్ లో ఫోర్లు, అశ్వనీ కుమార్ వస్తే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అంతెందుకు లాస్ట్ రెండు ఓవర్లలో 26 రన్స్ కొట్టాలి అని ఫ్యాన్స్ అంతా టెన్షన్ పడుతుంటే ఒక్క ఓవర్ లో అశ్వనీ కుమార్ ను 4 సిక్సర్లు బాది ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే 204 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసి పారేశాడు అయ్యర్. గెలిచాక కనీసం సెలబ్రేట్ కూడా చేసుకోలేదు. ఎందుకంటే తన లక్ష్యం ఇక ఆర్సీబీని కొట్టిం పంజాబ్ కు తొలి కప్ ను అందించటం ఆ లక్ష్యం కళ్ల ముందు ఉంది కాబట్టి ఇంత గొప్ప విజయాన్ని కూడా లైట్ తీసుకున్నాడు శ్రేయస్ అయ్యర్.





















