KKR vs SRH Abhishek Sharma Sixes | ఫైనల్ దారిలో హైదరాబాద్... కోల్ కతాను ఖతం చేస్తుందా..?| ABP Desam
KKR vs SRH Abhishek Sharma Sixes | నేడు అహ్మదాబాద్ వేదికగా కేకేఆర్ వెర్స్ ఎస్ఆర్హెచ్ మధ్య తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. ఐతే.. ఫ్యాన్స్ మాత్రం ఈ మ్యాచ్ కోల్ కతా , హైదరాబాద్ మధ్య అనడం కంటే కాటేరమ్మ కొడుకులు..భిక్షు యాదవ్ తమ్ముళ్ల మధ్య అనడం బెటర్ అంటున్నారు. ఎందుకంటే..ఈ సారి కాటేరమ్మకు బదులుగా srhను ఆదుకోవడానికి తన కొడుకులు ట్రావెస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ లను పంపించిందని.. కేకేఆర్ తరపున సై సినిమా రెఫరెన్స్ భిక్షు యాదవ్ తమ్ముళ్లు నరైన్, రసూల్ బరిలోకి దిగుతున్నారని దీని అర్థం. నిజమే.. ఈ రోజు వీళ్ల ఫర్మామెన్స్ ఆధారంగానే ఎవరు గెలుస్తారో , ఎవరు ఓడుతారో తెలుస్తుంది. హైదరాబాద్ విషయానికొస్తే... ట్రావెస్ హెడ్, అభిషేక్ శర్మల ఓపెనింగ్ పార్ట్ నర్ షిప్ కీలకం.వీళ్లు పవర్ ప్లేలో 80కిపైగా పరుగులు చేయడం ప్లస్ గా మారుతుంది. అలాగే, వీళ్లు ఎక్కువ సేపులో క్రీజులో ఉంటే 10 ఓవర్లకే మ్యాచ్ హైదరాబాద్ వైపు టర్న్ అవుతుంది. అలాగే, క్లాసెన్ కూడా చివర్లో మ్యాచ్ విన్నింగ్ ఆడాలి. ఇక కేకేఆర్ విషయానికొస్తే... నరైన్ ఓపెనింగ్ లో అదరగొడుతున్నాడు. ఒక సెంచరీ 450కిపైగా పరుగులతో సూపర్ స్ట్రైకర్ గా నిలుస్తున్నాడు. సో.. అతడిని ఎంత త్వరగా అవుట్ చేస్తే అంత మంచిది. అలాగే, srh అంటే చాలు విరుచుకుపడి పోతుంటాడు రస్సెల్. ఈ సీజన్ తొలి మ్యాచు లోనూ 64 పరుగులతో..2 వికెట్లతో రాణించాడు. సో..మిడిల్ ఓవర్స్ లో రసూల్ ను కట్టడి చేయకపోతే కేకేఆర్ బిగ్ స్కోర్ సాధించే అవకాశం ఉంది. ఇలా.. srh VS kkrలో ఈ ప్లేయర్స్ ఫర్మామెన్స్ ఆధారంగానే ..ఎవరు గెలుస్తారు అన్నది ఆధారపడి ఉంటుంది.