Heinrich Klaasen Controversial Out vs RCB | థర్డ్ అంపైర్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రీచ్ క్లాసెన్ క్యాచ్ అవుట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. RCB తో జరిగిన మ్యాచ్‌లో రొమారియో షెఫెర్డ్ బౌలింగ్‌లో క్లాసెన్ ఇచ్చిన క్యాచ్‌ను ఫిల్ సాల్ట్ బౌండరీ లైన్ వద్ద అందుకున్నాడు.
ఫిల్ సాల్ట్ క్యాచ్ అందుకునే క్రమంలో అతని కాలు బౌండరీ రోప్‌ను తాకినట్లు రిప్లేలో అనిపించింది. అయితే థర్డ్ అంపైర్ అన్ని కోణాల్లో పరిశీలించి క్లాసెన్‌ను అవుట్‌గా ప్రకటించారు. దీనిపై ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులే కాకుండా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా అసహనం వ్యక్తం చేశారు. "అంత తొందర ఎందుకు? బెనిఫిట్ ఆఫ్ డౌట్ బ్యాటర్‌కే ఇవ్వాలి" అని గవాస్కర్ అంపైరింగ్ తీరును తప్పుబట్టారు.
'థర్డ్ అంపైర్ మరికాస్త సమయం కేటాయిస్తే బాగుంటుంది. సమీక్షించేందుకు తొందర ఎందుకు? ఫిల్ సాల్ట్ బౌండరీ లైన్‌ను టచ్ చేసినట్లు కొందరికి అనిపించింది. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకొనేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాటర్‌కు అవకాశం ఇవ్వాలి. అందుకే నాకు ఈ నిర్ణయం సరిగ్గా అనిపించలేదు.'అని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.























