India vs England Test Day 1 Highlights | హాఫ్ సెంచరీ చేసిన సాయి సుదర్శన్
ఇండియా ఇంగ్లాండ్ నాలుగవ టెస్ట్ లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా క్రీజ్ లోకి దిగిన కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ మంచి భాగస్వామ్యం జోడించారు. 46 పరుగులు చేసిన కెఎల్ రాహుల్‌ని క్రిస్ వోక్స్ అవుట్ చేశాడు. అలాగే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాక యశస్వి జైస్వాల్ పెవిలియన్ చేరాడు.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 12 రన్స్ చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇక కరుణ్ నాయర్ ప్లేస్‌లో వచ్చిన సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ చేసి పర్వాలేదు అనిపించుకున్నాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయిన రిషబ్ పంత్ గాయపడ్డాడు. దాంతో 37 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్ అవ్వాల్సి వచ్చింది.
తొలి రోజే కెప్టెన్ బెన్స్ స్టోక్స్ 2 కీలక వికెట్లు తీసాడు. 9 ఏళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడిన ఇంగ్లాండ్ బౌలర్ లియామ్ డాసన్ ..యశస్వి జైస్వాల్ వికెట్ తీశాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి టీం ఇండియా 264 పరుగులు చేసింది. శార్దుల్ ఠాకూర్, జడేజా ప్రస్తుతం బ్యాట్టింగ్ చేస్తున్నారు. అయితే తోలి రోజు ఇలా వరుసగా వికెట్స్ పడడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేస్తుందని అందరు భావించారు. అప్పుడే ఈ మ్యాచ్‌లో ఇండియా పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. మరి రెండవ రోజు బ్యాట్స్మన్ జడేజా, శార్దుల్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.





















