India vs England | మూడవ రోజు పర్వాలేదనిపించిన సాయి సుదర్శన్
ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ లో భాగంగా మూడు రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 పరుగులతో లీడ్ లో ఉంది టీం ఇండియా. మూడవ రోజు మ్యాచ్ వర్షం వల్ల తొందరగానే ముగిసిపోయింది. రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీకి 3 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం గిల్, కేఎల్ రాహుల్ క్రిజ్ లో ఉన్నారు. ఫస్ట్ హాఫ్ లో సెంచరీ చేసిన జైస్వాల్ ఈ సారి 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయిన సాయి సుదర్శన్ 30 పరుగులు చేసి పర్వాలేదు అనిపించాడు. ప్రస్తుతం ఇండియా 96 పరుగుల ఆధిక్యంలో ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌటైంది. పేసర్ బుమ్రా అదుభతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ 99 పరుగులకు అవుట్ అయ్యాడు. ఒకే ఒక్క రన్ తో సెంచరీ మిస్ చేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ హీరో ఓలీ పోప్ మూడో రోజు ఆట మొదలైన కొద్దిసేపటికే పెవిలియన్ చేరాడు.





















