India England Match Draw | ఓవల్ టెస్ట్ డ్రా అయితే ట్రోఫీ ఎవరికి ?
భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. మాంచెస్టర్ లో జరిగిన నాలుగవ టెస్ట్ డ్రా అయ్యింది. ఓవల్ లో జరిగే ఐదవ టెస్ట్ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను 2 - 2 తో సమం చేస్తామని హెడ్ కోచ్ గౌతమ్ గంబీర్ చెప్పాడు. గంబీర్ చెప్తున్నట్టు ఐదవ టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలిచి... సిరీస్ డ్రా అయితే ట్రోఫీ ఎవరికి లభిస్తుంది? అసలు రూల్స్ ఎం చెప్తున్నాయి చూదాం.
టెస్ట్ మ్యాచ్ లో రెండు టీం మధ్య సిరీస్ డ్రా అయితే ... చివరిసారి ఈ ట్రోఫీని గెలుచుకున్న టీంకు ట్రోఫీని ఇస్తారు. ఆలా చూస్తే ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన అండర్సన్-టెండూల్కర్ సిరీస్ 2021-22 లో జరిగింది. అప్పుడు ఈ సిరీస్ డ్రాగా ముగిసింది. అంతకన్నా ముందు ఇదే సిరీస్ 2018లో జరిగింది. అప్పుడు ఇంగ్లాండ్ 4-1 భారీ తేడాతో సిరీస్ ను గెలుచుకుంది. అప్పటి నుంచి ఈ ట్రోఫీ ఇంగ్లాండ్ దే కాబట్టి.... ఈ సిరీస్ డ్రా అయితే మళ్ళి ట్రోఫీ ఇంగ్లాండ్ దెగ్గరే ఉంటుంది. అయితే ఐదవ టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా గెలవడానికి ప్లేయింగ్ 11 భారీ మార్పులు చేస్తుంది. హెడ్ కోచ్ గంబీర్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. మరి ఓవల్ టెస్ట్ లో గిల్ సేన ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి.



















