India England 5th Test Series | ఐదవ టెస్టులో భారీ మార్పులు
ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ తో ఈనెల 31 నుంచి లండన్ లోని ద ఓవల్ లో జరగబోతుంది. అయితే టీమిండియా ప్లేయింగ్ లెవన్ గురించి అప్పుడే చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా బుమ్రా ఆడతాడా..? లేదా అనేది క్వశ్చన్ గా మారింది. ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే బుమ్రా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడతాడాని టీమ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. సో బుమ్రా ఆడాల్సిన మ్యాచులు అయిపోయ్యాయి. ఐదో టెస్టులో బుమ్రా ఆడతాడా... లేదా అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని హెడ్ కోచ్ గౌతం గంభీర్ అన్నాడు. ఐదో టెస్టుకు సంబంధించి గంభీర్ మాట్లాడుతూ.. ఐదో టెస్టును గెలిచి, 2-2తో సిరీస్ ను సమం చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
అయితే ప్లేయింగ్ లెవన్ లో మాత్రం మార్పులు తప్పేలా లేదు. బుమ్రా, మహ్మద్ సిరాజ్ .... ఈ ఇద్దరిలో ఎవరు ఆడకపోయినా, అర్షదీప్ సింగ్ ను ఆడించే అవకాశముంది. అన్షుల్ కాంబోజ్ ను తప్పించి, ఆకాశ్ దీప్ ను ఆడించవచ్చు. బ్యాటింగ్ లైనప్ లో ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఆడతారు. మూడోస్తానంలో సాయి సుదర్శన్ కు మరో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. రిషభ్ పంత్ స్తానంలో ధ్రువ్ జురెల్ ఆడటం ఖాయం. ఒకవేళ వికెట్ స్పిన్ కు అనుకూలిస్తే శార్దూల్ ఠాకూర్ స్తానంలో కుల్దీప్ యాదవ్ ను ఆడించొచ్చు. పిచ్ పరిస్థితిని బట్టి టీమిండియా మేనేజ్ మెంట్ ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.





















