Kuldeep Yadav Spin Bowling । కుల్దీప్ యాదవ్ పై మంజ్రేకర్ ఆసక్తికర ట్వీట్ | ABP Desam
ఆసియా కప్ 2025 లో టీమిండియా సూపర్ బోని కొట్టింది. బుధవారం UAE తో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో బంపర్ విక్టరీ సాధించింది. అయితే ఈ విక్టరీ లో కీ రోల్ పోషించిన kuldeep yadav మాత్రం నెక్స్ట్ జరగబోయే పాకిస్తాన్ మ్యాచ్ లో అడేలా కనిపించడం లేదు. ఈ మాట నేను కాదు స్పోర్ట్స్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అంటున్నాడు. నిజానికి ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లంతా సూపర్ బౌలింగ్ తో అదరగొట్టిన Kuldeep వేసిన ఒకే ఒక్క ఓవర్ మొత్తం మ్యాచ్ నే మార్చేసిందని చెప్పొచ్చు. మొత్తము 2.1 ఓవర్లు వేసిన కుల్దీప్.. 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. ముఖ్యంగా మొదటి ఓవర్లోనే 3 కీలక వికెట్లు తీసి యూఏఈ బ్యాటింగ్ ను పూర్తిగా దెబ్బతీశాడు. కెప్టెన్ మహమ్మద్ వసీంతో పాటు రాహుల్ చోప్రా, హర్షిత్ కౌశిక్ లని ఔట్ చేసి మ్యాచ్ ని తిప్పేసాడు. కుల్దీప్ దెబ్బకి UAE టీం పునాదులు కదిలిపోయాయి. ఇంత అద్భుతమైన ప్రదర్శన చూసి సంజయ్ మంజ్రేకర్ ఒక ఫన్నీ ట్వీట్ చేశారు. "కుల్దీప్ 1 ఓవర్ లో 3 వికెట్లు తీశాడు. ఇప్పుడు బహుశా అతను తర్వాతి మ్యాచ్ ఆడకపోవచ్చు." అని మంజ్రేకర్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ ఒక జోక్ లా కనిపించినా, అభిమానుల్లో మాత్రం కొంత భయం మొదలైంది. గతంలో కూడా
2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కుల్దీప్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు, బ్యాటింగ్ లో కూడా 40 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. కానీ తర్వాతి మ్యాచ్ లో అతన్ని జట్టు నుండి తొలగించారు. ఇక IPL, దేశవాళీల్లో అద్భుతమైన ప్రదర్శన చేసినా టెండూల్కర్, అండర్సన్ ట్రోఫీ లో ఆదించలేదు. అందుకే ఈ సారి కూడా అలాగే అవుతుందనే కోణంలో మంజ్రేకర్ ఈ ట్వీట్ చేశాడు.
ఇక భారత్ తర్వాతి మ్యాచ్ పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ ముఖ్యమైన మ్యాచ్‌లో కుల్దీప్ ని తీసేస్తే అది టీమిండియాకి చాలా నష్టం కలిగిస్తుంది. మరి మంజ్రేకర్ జోస్యం నిజామ్ అవుతుందా? లేదంటే Kuldeep నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడతాడా? కామెంట్ చేసి చెప్పండి.





















