Eng vs Ind 5thTest 4th Day Highlights | అత్యంత ఆసక్తికరంగా మారిపోయిన ఓవల్ టెస్టు | ABP Desam
35పరుగులు చేస్తే 3-1 తేడాతో ఇంగ్లండ్ సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. 4వికెట్లు తీస్తే గట్టిగా మాట్లాడితే వోక్స్ ఆడకపోతే 3వికెట్లే...ఆ మూడు వికెట్లు తీస్తే భారత్ 2-2 తో టెస్ట్ సిరీస్ ను ఇంగ్లండ్ గడ్డపై డ్రా చేసుకుంటుంది. ఏం జరగాలన్నా ఐదో రోజే మొదటి సెషన్ లోనే జరిగిపోవటం ఖాయం. కాకపోతే ఏం జరుగుతుందే అనేది టెన్షన్ అంతా. 384 పరుగుల టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ కు నాలుగో రోజు జో రూట్, హ్యారీ బ్రూక్ తిరుగులేని పార్టనర్ షిప్ తో కావాల్సినంత భరోసా ఇచ్చారు. జో రూట్ 105పరుగులతో మరోసారి సింపుల్ గా సెంచరీ కొట్టేయగా...యంగ్ హ్యారీ బ్రూక్ వన్డే స్టైల్ ఇన్నింగ్స్ తో ధనా ధన్ సెంచరీ బాదేశాడు. 98బాల్స్ లోనే 111పరుగులు చేసి బాజ్ బాల్ ఆట చూపించాడు. అయితే రోజు చివరికి వచ్చేసరికి భారత బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను టపా టపా కూల్చటంతో టీమిండియా మళ్లీ రేస్ లోకి వచ్చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ 3వికెట్లు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు. ప్రస్తుతం జేమీ స్మిత్ 2 పరుగులు, జేమీ ఓవర్టన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. బ్యాడ్ లైట్ వల్ల మ్యాచ్ త్వరగా ఆగిపోయింది కానీ లేదంటే నాలుగో రోజే ఫలితం తేలిపోయేదన్నట్లుంది పరిస్థితి. అయితే లాస్ట్ సెషన్ లో ఇంగ్లండ్ స్ట్రగుల్ అయిన తీరు చూస్తే భారత్ మిగిలిన వికెట్లు కూడా తీసినా ఆశ్చర్యం లేదన్నట్లు కనిపించింది. చూడాలి ఐదో టెస్టు ఐదో రోజు ఆటలో భారత్ ఆ 35పరుగుల్లోపు మిగిలిన 4 వికెట్లు తీసేసి ఓవల్ టెస్టు గెలుచుకోవటంతో టెస్ట్ సిరీస్ ను 2-2తో సమానం చేస్తుందా లేదా మిగిలిన పరుగులు కొట్టించుకుని 1-3 తేడాతో ఇంగ్లండ్ కు సిరీస్ ను సమర్పించుకుంటుందా. లాస్ట్ రోజు మ్యాచ్ అయితే మంచి ఆసక్తికరంగా ఉండనుంది.





















