Cheteshwar Pujara Retirement | క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన పుజారా
ఓ చిన్న కుర్రాడిగా ఉన్నప్పుడు.. రాజకోట్‌లోని ఓ చిన్న టౌన్ నుంచి తల్లిదండ్రులతో కలిసి చుక్కలని అందుకోవాలని అనుకున్నాను. ఇండియన్ క్రికెట్ టీమ్‌లో స్థానం సంపాదించుకోవాలని కలలు కన్నాను. అప్పట్లో నాకు తెలిసింది ఒక్కటే! ఈ గేమ్ నాకెంతో ఇస్తుంది. విలువైన అవకాశాలు, అనుభవం, లక్ష్యం, ప్రేమ.. వీటన్నింటికంటే గొప్పగా నా రాష్ట్రాన్ని, నా ఈ గొప్ప దేశాన్ని గౌరవించుకోగలిగే అవకాశం దొరుకుతుంది. అంతే. ఇండియన్ జెర్సీ ధరించడం, జాతీయ గీతం ఆలపించడం, గ్రౌండ్‌లో అడుగుపెట్టిన ప్రతిసారీ నా బెస్ట్ ఇవ్వడం.. ఇవన్నీ నాకెంత ప్రత్యేకమో మాటల్లో చెప్పలేను. కానీ అన్ని మంచి విషయాలకీ ఎప్పుడో ఒకప్పుడు ముగింపు పలకాల్సిందే కదా. అందుకే నా ప్రయాణంలో నాకు అండగా నిలిచి నన్ను ఎంతగానో అభిమానించిన మీకందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ క్రికెట్‌కి సంబంధించిన అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నా..! నాకెంతో విలువైన గైడెన్స్ ఇచ్చి నన్నింతవరకు నడిపించిన నా మెంటార్స్‌కి, కోచ్‌లకి, ఆధ్యాత్మిక గురువులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. క్రికెటర్‌గా అవకాశాలిచ్చి నా క్రికెట్ కెరీర్లో నాకు అండగా నిలిచిన బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్ అసోసిషన్‌కి ఎంతో థ్యాంక్స్. నేను ఆడిన ఫ్రాంచైజీలకి, నన్ను సపోర్ట్ చేసిన ప్లేయర్లకి నా ఈ జర్నీలో తోడుగా ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్‌కీ పేరుపేరునా మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ప్రతి క్షణం నాకు మద్దతుగా ఉన్న ఫ్యాన్స్‌ని ఎప్పటికీ మర్చిపోను. అన్నింటికంటే ముఖ్యంగా నా కోసం నా తల్లిదండ్రులు, నా భార్య పూజ, నా కూతురు అదితి మిగిలిన కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలు, వాళ్లిచ్చిన అనితరసాధ్యమైన మద్దతు లేకపోతే నేను ఇదంతా కచ్చితంగా సాధించలేకపోయేవాడిని. వాళ్ల వల్లే నా ఈ జర్నీ ఎంతో గొప్పగా సాగింది. రిటైర్మెంట్ తర్వాత నా లైఫ్‌లోని సెకండ్ ఫేజ్‌లో వాళ్లకి ఎక్కువ టైం ఇవ్వడానికి ప్రయత్నిస్తా. నాపై మీరు చూపించిన ప్రేమకి.. నాకు మీరిచ్చిన సపోర్ట్‌కి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇక సెలవ్.





















