Karthika Masam: కార్తీకమాసమని అనారోగ్యంగా ఉన్నా ఉపవాసముంటున్నారా?
వాస్తవానికి కార్తీకమాసంలో ఆచరించే ప్రతి నియమం మీరెంత పటిష్టంగా ఉన్నారు, ఎంత ఆరోగ్యంగా ఉన్నారని టెస్ట్ చేసుకోవడం కోసమే. మొదటి వారం రోజులు మీరు పాటించిన నియమాల కారణంగా మీరు తేలికపడ్డారా, మరింత అనారోగ్య సమస్యల్లోకి కూరుకుపోయారా అన్నది గమనించుకోవాలి. కార్తీకమాసంలో ఈ నియమాలు పాటించకపోతే ఏదో జరుగుపోతుందనే భ్రమలో ఉండొద్దని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక ఇళ్లలో స్నానం చేసేవారి సంఖ్య సరేకానీ నదుల్లో మునిగేవారు జాగ్రత్తగా ఉండాలి. అప్పట్లో ఇంత పొల్యూషన్ ఉండేది కాదు...చెరువుల నుంచి నదుల వరకూ అన్నింటిలో నీరు స్వచ్ఛంగా ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. నీరు, ఆహారం , గాలి అన్నీ కలుషితం అయిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో భక్తి పేరుతో అనారోగ్యాన్ని పెంచుకోవద్దని సూచిస్తున్నారు.



















