YCP MLA Sridevi: డా.బీఆర్ అంబేడ్కర్ పై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి షాకింగ్ కామెంట్స్..
అంబేడ్కర్ పై తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ను ఉద్దేశించి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి. ప్రపంచ మాదిగ దినోత్సవ ప్లీనరీలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ అంబేడ్కర్ వల్ల మాదిగలకు వచ్చిందేమీ లేదన్నారు. అంబేడ్కర్ వల్ల వచ్చిన హక్కులు ఏమీ లేవని శ్రీదేవి వ్యాఖ్యానించారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాస్తే దానిని సక్రమంగా అమలు చేసిన బాబూ జగ్జీవన్ రామ్ వల్లే మాదిగలకు రాజ్యాంగ హక్కులు సంక్రమించాయని అన్నారు. ప్రతి ఒక్కరూ బాబూ జగ్జీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. మరోవైపు శ్రీదేవి వ్యాఖ్యలపై అంబేడ్కర్ అభిమానులు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యే శ్రీదేవి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.





















