Nobel Prize Nomination for Ukraine President Zelenskyy : Nobel రేసులో ఉక్రెయిన్ అధ్యక్షుడు...! |
ఉక్రెయిన్ అధ్యక్షుడు Volodymyr Zelenskyyని Nobel Peace Prizeకి Nominate చేశారు... Europe నేతలు. ఐరోపా సమాఖ్యకు చెందిన నేతలు, మాజీ నాయకులు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ మేరకు Norwegian Nobel Committee కి లేఖ రాశారు. 2022కు సంబంధించి నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్స్ పంపే గడువు ముగిసింది. అయినప్పటికీ జెలెన్‌స్కీకి నోబెల్ బహుమతి అందించేందుకు నామినేషన్ల గడువును ఈనెల 31 వరకు పొడిగించాలని ఐరోపా నేతలు కోరారు. అయితే, ఈ ప్రతిపాదనను నార్వేజియన్ నోబెల్ కమిటీ అంగీకరిస్తుందో లేదో చూడాలి. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి 92 సంస్థల నుంచి 251 నామినేషన్లు వచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్ 3-10 మధ్య నోబెల్ బహుమతుల్ని ప్రకటిస్తారు.





















