Mukesh Ambani Met Trump at Qatar | ఖతార్ లో ట్రంప్ ను కలిసిన రిలయన్స్ అధినేత | ABP Desam
అపర కుబేరుడు, ఆసియా ఖండపు రిచెస్ట్ మ్యాన్ ముకేశ్ అంబానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలిశారు. ఖతార్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు..దోహాలోని ఎమిర్ ఆఫ్ ఖతార్ అయిన షేక్ తమీమ్ బిన్ హమద్ అల్తానీకి చెందిన రాజప్రాసాదం లుసాయిల్ ప్యాలెస్ కి వెళ్లారు. ఖతార్ సంస్కృతి ఉట్టిపడేలా ట్రంప్ కు అక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగానే ట్రంప్ ను ముకేశ్ అంబానీ కలిశారు. ఆసియా లోనే రిచెస్ట్ మ్యాన్ గా ఉన్న అంబానీ ట్రంప్ ను ఎందుకు కలిశారనే ఆసక్తి అందరిలో నెలకొంది. వాస్తవానికి ఇదొక గెస్ట్ ఆఫ్ హానర్ అంతే. ఖతార్ సుల్తాన్ ట్రంప్ పర్యటనలో క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేయటగా అందుకోసం వంద మంది విశిష్ఠ అతిథులను ఆహ్వానించారు. అందులో భాగంగా ముకేశ్ అంబానీకి ఆహ్వానం లభించింది. అంతే కాకుండా ఖతర్ ఎమిర్ కుటుంబానికి చెందిన ఖతార్ సావరిన్ వెల్త్ ఫండ్ QIA కంపెనీ రిలయన్స్ సంస్థల్లో కొన్ని ఏళ్లుగా పెట్టుబడులు పెడుతూ వస్తోంది. సో ఆ విధంగా ఖతార్ ఎమిర్ కుటుంబానికి ముకేశ్ అంబానీ వ్యాపార భాగస్వామి కూడా.





















