Khalistani Terrorists Firing Kapil Sharma Café | కెనడాలో కపిల్ శర్మ రెస్టారెంట్ పై ఉగ్రదాడి | ABP Desam
ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ ప్రారంభించిన కెనడాలోని రెస్టారెంట్‌పై ఉగ్రదాడి జరిగింది. బ్రిటీష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఉన్న ఈ కెఫే వద్దకు గుర్తుతెలియని దుండగులు కారులో వచ్చి కాల్పులు జరిపారు. ఈ దాడికి ఖలీస్థానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) బాధ్యత వహించామని ప్రకటించింది. BKIకు చెందిన హర్జీత్ సింగ్ లద్దీ ఈ దాడికి నేరుగా సంబంధం ఉందని వెల్లడించుకున్నారు. హర్జీత్ సింగ్ ఇప్పటికే భారతదేశం జారీ చేసిన NIA మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నారు. కపిల్ శర్మ ఇటీవలే ఈ కఫేను ప్రారంభించగా ఈలోగా దుర్ఘటన జరిగింది. కాల్పుల ఘటనపై కెనడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ప్రస్తుతం ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ దాడిపై కపిల్ శర్మ ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. పంజాబ్ కు చెందిన కపిల్ శర్మ రెస్టారెంట్ పై దాడి జరపటం ద్వారా ఖలిస్థానీ ఉద్యమం ఉనికిని చాటాలని దుండగులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.





















