విషం ఎక్కించినా చావని మొండోడు.. హమాస్ న్యూ చీఫ్ మాషల్
హమాస్ చీఫ్ సిన్వర్ చనిపోయిన వెంటనే ఆ పొజిషనల్‌లోకి వచ్చాడు ఖలీద్ మాషల్. సిన్వర్ మృతితో హమాస్‌లో క్రైసిస్ తప్పదని చర్చ జరుగుతున్న సమయంలో మాషల్ కీలక బాధ్యతలు తీసుకున్నాడు. ఇకపై హమాస్‌ని ముందుండి నడిపించనున్నాడు. అయితే...సిన్వర్ బతికి ఉన్న సమయంలో వీళ్లిద్దరికీ అభిప్రాయ భేదాలుండేవి. 2004-17 వరకూ హమాస్‌ని లీడ్ చేశాడు మాషల్. కానీ...హమాస్ లీడర్స్‌తో అభిప్రాయ భేదాలు రావడం వల్ల ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. అప్పుడే సిన్వర్‌తోనూ మనస్పర్దలు వచ్చాయి. ఆ తరవాతే సిన్వర్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే...మాషల్‌ని హమాస్ చీఫ్‌గా ఎన్నుకోడానికి ఓ రీజన్ ఉంది. 15 ఏళ్లకే ముస్లిం బ్రదర్‌హుడ్‌లో చేరాడు మాషల్. ఆ తరవాత క్రమంగా ఎదిగి హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
అప్పటి నుంచి యాక్టివ్ అయ్యాడు. 1997లో ఇజ్రాయేల్ ఓ సారి మాషల్‌ని మట్టుబెట్టేందుకు ప్రయత్నించింది. ఓ వీధిలో ఉండగా ఇజ్రాయేల్ ఏజెంట్‌లు మాషల్‌కి విషాన్ని ఇంజెక్ట్ చేశారు. అప్పట్లో ఈ దాడి సంచలనం సృష్టించింది. జోర్దాన్ కింగ్ ఆ విషానికి విరుగుడు ఇచ్చి కాపాడాడు. ఆ తరవాత కూడా ఇజ్రాయేల్ చాలా సార్లు మాషల్‌ని చంపేందుకు ప్లాన్ చేసింది. కానీ...ప్రతిసారీ తప్పించుకున్నాడు. హమాస్‌కి పెద్ద ఎత్తున ఫండింగ్ తీసుకొచ్చి..బేస్‌మెంట్‌ని స్ట్రాంగ్ చేశాడు మాషల్. 1987 నుంచే హమాస్‌లోని కీలక నేతల్ని చంపాలని ఆయుధాలు సిద్ధం చేసుకుంటోంది ఇజ్రాయేల్. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరినీ మట్టుబెడుతోంది.