TDP Corporator:పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించ లేదని మంత్రిపై టీడీపీ కార్పొరేటర్ ఫైర్
విజయవాడలో టీడీపీ,వైసీపీ నేతల మద్య ఉద్రిక్తత నెలకొంది. కొత్తగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కాస్త ప్రోటోకాల్ వివాదానికి దారితీసింది. మంత్రి వెల్లంపల్లి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తన డివిజన్ లో పర్యటిస్తూ తనకు సమాచారం ఇవ్వలేదని చంటి ఆరోపిస్తూ వారితో వాదనకు దిగారు. కార్పొరేషన్ అధికారులు, ప్రజా ప్రతినిధుల తీరును ఎండ గడుతూ చంటి చేసిన వ్యాఖ్యలు మంత్రి వెల్లంపల్లి అనుచరులకు ఆగ్రహం తెప్పించాయి. వారు ఒక్కసారిగా చంటిని అడ్డుకోవడంతో టీడీపీ, వైసీపీ వర్గాలు బాహాబాహికి దిగాయి. చంటి తన అనుచరులతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి వద్ద రోడ్డుపై కూర్చుని నిరసనకు దిగారు. మంత్రి దీనిపై సమాధానం చెప్పాలంటూ పట్టుబట్టారు





















