T20 CWC Schedule released: 2022 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ
ఆస్ట్రేలియాలో జరగబోయే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. ఆస్ట్రేలియాలో కొన్ని ప్రదేశాల్లో ఆటగాళ్ల ఇమేజెస్ ను ప్రొజెక్ట్ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టింది. అక్టోబర్ 16 నుంచి 21 వరకు ఫస్ట్ రౌండ్ మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఇందులో శ్రీలంక, వెస్టిండీస్, నమీబియా, స్కాట్లాండ్ తో పాటు మరో నాలుగు జట్లు.... సూపర్-12 దశలోని నాలుగు స్థానాల కోసం పోటీపడతాయి. అక్టోబర్ 22 నుంచి సూపర్ 12 దశ స్టార్ట్ అవుతుంది. తొలి మ్యాచ్ గతేడాది ఛాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ కివీస్ మధ్య జరగనుంది. అక్టోబర్ 23న భారత్ తన తొలి మ్యాచ్ ను మరోసారి పాక్ తోనే ఆడనుంది. భారత్, పాకిస్థాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ తో పాటు మరో రెండు క్వాలిఫయింగ్ జట్లు మన గ్రూప్ లో ఉన్నాయి.





















