అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్, సీబీఐ కేసులో ఊరట
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. రూ.10 లక్షల పూచీకత్తు ఇవ్వాలని షరతు విధించింది. ఎక్కడా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడకూడదని కండీషన్ పెట్టింది. సీబీఐ కేసులో ఈ బెయిల్ ఇచ్చింది. ఫలితంగా..6 నెలల పాటు తీహార్ జైలులో ఉన్న ఆయన విడుదల కానున్నారు. అటు, సుప్రీం తీర్పుపై ఆప్ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. జైలు బయట మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. కాగా, మద్యం పాలసీకి సంబంధించి గతంలో ఈడీ కేసులో బెయిల్ రాగా.. సీబీఐ కేసులో సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కాంలో మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయగా.. ఈడీ కస్టడీలో ఉన్న ఆయన్ను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే...కేజ్రీవాల్ బయటకు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతే కాదు. ఫైల్స్‌పై సంతకాలూ పెట్టొద్దని వెల్లడించింది.