Simhachalam Vaikunta Darshan: కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే సింహాద్రి అప్పన్న వైకుంఠ దర్శనం
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తరలి వచ్చే భక్తుల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది సింహాచలం దేవస్థానం. రేపు ఉదయం 5 గంటల నుండి 10 గంటల మధ్యలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు స్వామీ వారి దర్శనం కల్పిస్తున్నట్లు ఈవో సూర్యకళ తెలిపారు.కోవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ కనీసం 15 వేల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారంతా భౌతిక దూరం,మాస్క్ పెట్టుకోవడం లాంటి నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారామె. అలాగే వృద్ధులుమహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు,వాలంటీర్లను ఏర్పాటు చేశామన్నారు.VIP లుసామాన్యులు అనే తేడా లేకుండా అందరకీ స్వామివారి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేశామన్నారు.అయితే ,కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఇప్పటికే అంతరాలయ దర్శనం రద్దు చేసినప్పటికీ,వైకుంఠ ఏకాదశి నాడు జరిగేది ఉత్తర ద్వార దర్శవం కాబట్టి భక్తులకు ఇబ్బంది ఉండదంటున్న ఈవో సూర్యకళ తో మా ప్రతినిధి విజయ్ ముఖాముఖి