RRR New Release Date : రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి త్రయం RRR విడుదల తేదీ ప్రకటన
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. సంక్రాంతికి వారం ముందు థియేటర్లలో సినిమా సందడి చేయడం పక్కా అని అనుకున్నారంతా! అనుకున్న సమయంలో కరోనా మూడో దశ వచ్చింది. దాంతో సినిమాను వాయిదా వేయక తప్పలేదు. ఇప్పుడు కొత్త విడుదల తేదీని ప్రకటించారు. మార్చి 18న లేదంటే.. ఏప్రిల్ 28న (RRR New Release Date) 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ఈ రోజు సినిమా టీమ్ వెల్లడించింది. వేసవి సీజన్‌ను టార్గెట్ చేస్తూ... పీరియాడికల్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. "దేశంలో కరోనా తగ్గి... థియేటర్లు తెరుచుకుని ఫుల్ కెపాసిటీతో రన్ అయితే... మార్చి 18న సినిమా విడుదల చేయడానికి మేం రెడీగా ఉన్నాం. లేదంటే ఏప్రిల్ 29న సినిమా విడుదల అవుతుంది" అని 'ఆర్ఆర్ఆర్' టీమ్ పేర్కొంది.