అన్వేషించండి
Advertisement
Rajasthan Minister: నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితిని మార్చాలంటూ రాజస్థాన్ మంత్రి చేసిన కామెంట్ వైరల్
ఇటీవలే మంత్రి వర్గంలో చోటుదక్కించుకున్న రాజేంద్ర సింగ్ గుడా ఝున్‌ఝును జిల్లాలోని తన నియోజకవర్గంలోని ఉడైపురవాటి ప్రాంతం ప్రజలతో సమావేశమయ్యారు. ఆయనతో తమ సమస్యల్ని విన్నవించుకుంటున్న జనం.. తమ ప్రాంతంలో రహదారులను బాగుచేయించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అక్కడే ఉన్న పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఇంజినీర్‌తో 'నా నియోజకవర్గంలో రహదారులు కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి' అని మంత్రి అన్నారు. దీంతో అక్కడి ప్రజల్లో కొందరు చప్పట్లు కొట్టారు. మరికొందరు నవ్వులు చిందించారు.అయితే, రాజకీయ నాయకులు రహదారులను సినీతారల బుగ్గలతో పోల్చడం ఇదే తొలిసారి కాదు. 2005లో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కూడా రహదారుల్ని హేమమాలిని బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ హామీ ఇవ్వడం అప్పట్లో వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.
ఇండియా
Private School Bus Accident CCTV Video | ఓ బాలుడు మృతి, 13 మంది పిల్లలకు గాయాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కర్నూలు
హైదరాబాద్
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion