తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురు
పవన్ కళ్యాణ్ రెండో కుమార్తె తొలిసారిగా మీడియాకు కనిపించారు. పవన్ అన్నా లెజీనోవా కుమార్తె ఈమె. పేరు పొలేనా అంజనా పవనోవా. 2013లో అన్నా లెజీనోవాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఆయనకు అది మూడో వివాహం. అన్నా లెజీనోవా పవన్ కళ్యాణ్ దంపతులకు ఇద్దరు పిల్లలు. మొదట పాప జన్మించగా ఆ పాపకు తన తల్లి పేరు తన పేరు వచ్చేలా పొలేనా అంజనా పవనోవా అని పేరు పెట్టుకున్నారు. తర్వాత బాబు జన్మించగా తన అన్నయ్య చిరంజీవి అసలు పేరు, తనకిష్టమైన కార్ల్స్ మార్క్స్ పేరు తన పేరు వచ్చేలా మార్క్ శంకర్ పవనోవిచ్ అని పేరు పెట్టుకున్నారు. అంజనా పవనోవా, మార్క్ శంకర్ పవనోవిచ్ బాగా చిన్నప్పుడు మీడియాకు కనపడటం తప్ప తర్వాత మీడియాకు ఎప్పుడూ కనిపించలేదు. లో ప్రొఫైల్ లో పిల్లల్ని పెంచారు. ఇప్పుడు తిరుమల దర్శనం కోసం తన పెద్దకుమార్తె ఆద్య, చిన్న కుమార్తె అంజనా పవనోవాతో కలిసి పవన్ కళ్యాణ్ రావటం..తన రెండో కుమార్తె క్రిస్టియన్ సంప్రదాయంలోనే పెరుగుతున్నందున ఆమె తరపున తిరుమల దర్శనానికి డిక్లరేషన్ ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది.