Omicron Testing Center : కేరళ తరువాత ఎపీలోని బెజవాడలోనే ఓమిక్రాన్ టెస్టింగ్ సెంటర్
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ప్రజానీకమంతా అప్రమత్తంగా ఉండాలని విజయవాడ జిజిహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒమిక్రాన్ ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని విజయవాడ ప్రభుత్వం హాస్పిటల్ లో ప్రత్యేకంగా మూడు వందల పడకలను సిద్ధం చేశామని వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విజయవాడలో లోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఒమిక్రాన్ నిర్ధారణ కోసం ప్రత్యేకంగా సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు.రానున్న రోజుల్లో పండగలు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా ప్రభుత్వ సూచనల నిబంధనలు పాటించాలని వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు నగరంలో ఎటువంటి ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని వెల్లడించారు.





















