Minister KTR: విభిన్న ప్రతిభావంతుల కోసం తెలంగాణలో ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీ
పంజాబ్ కు చెందిన బధిర చెస్ ప్లేయర్ మలికా హండా ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు. అనేక జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో ఎన్నో పతకాలు సాధించిన ఈమె... తనకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పంబాబ్ ప్రభుత్వం విఫలమైందని తన బాధను వెళ్లగక్కారు. తాను సాధించిన మెడల్స్ ను చూపిస్తూ తన సమస్యలను ఓ వీడియో ద్వారా తెలియచేశారు. తన సైగల అర్థాన్ని వీడియో పక్కన ఓ నోట్ రూపంలో జత చేశారు. ఈ వీడియోకు స్పందించిన కేటీఆర్ ఆ ప్రతిభావంతురాలికి వ్యక్తిగతంగా తాను సాయం అందిస్తానని ట్వీట్ చేశారు. అంతే కాదు తెలంగాణలో విభిన్న ప్రతిభావంతుల ఆటగాళ్లకు ప్రత్యేక పాలసీ ఉండాలని సామాజిక ఉద్యమకారిణి సునీతా కృష్ణన్ కోరగా..సహచర మంత్రి శ్రీనివాస గౌడ్ ను ఆ మేరకు కొత్త పాలసీతో రావాలని కేటీఆర్ సూచించారు.





















