Lance naik : లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబసభ్యులను ఫోన్ లో పరామర్శించిన ఉపరాష్ట్రపతి
తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన ఇండియన్ ఆర్మీ లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబాన్ని ఫోన్ ద్వారా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,కేంద్ర సాంస్కృతిక,పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిలు పరామర్శించారు. మీ కుటుంబానికి అండగా నిలుస్తామని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సాయితేజ తండ్రి కృష్ణయ్యకు భరోసా ఇచ్చారు. ఎప్పుడూ ఏ అవసరం వచ్చినా తనను కలవమని,ఫోన్ ద్వారా సంప్రదించ వచ్చని వెంకయ్య నాయుడు తెలిపారు. సాయితేజ సతీమణి శ్యామలను ఫోన్ ద్వారా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించి ధ్యైర్యం చెప్పారు.సాయితేజ కుటుంబానికి అంతా అండగా ఉంటామని... చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కలుస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















