Jayyamma Panchayathi: సుమ 'జయమ్మ పంచాయతీ' టీజర్ ను విడుదల చేసిన రానా దగ్గుబాటి
బుల్లి తెర వ్యాఖ్యాత సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. విజయ్ కలివారపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను నటుడు రానా ఆదివారం విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ టీజర్‌లో పంచాయతీ నేపథ్యంలో సాగే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. జయమ్మగా సుమ లుక్స్, నటన ఆకట్టుకునేలా ఉన్నాయి. బలగ ప్రకాశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకులు ముందుకురానుంది. ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ చిత్రంతో వెండితెరకి పరిచయమైన సుమ ‘పవిత్ర ప్రేమ’, ‘చాలా బాగుంది’, ‘వర్షం’, ‘ఢీ’, ‘బాద్‌షా’ తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.





















