USBP Remarks on Indian Migrants Deportation | ఓవరాక్షన్ చేసిన అమెరికా బోర్డర్ పెట్రోల్ | ABP Desam
అమెరికా లో అక్రమంగా వలస ఉంటున్న 104 మంది ఇండియన్స్ ను వెనక్కి పంపించే క్రమంలో అక్కడి అధికారుల ఓవరాక్షన్ బయటపడింది. మెక్సికో అమెరికా బోర్డర్ లో పట్టుబడిన అక్రమ వలసదారులతో అక్కడి సైన్యం ఎలా ప్రవర్తించిందో తెలిసేలా ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో కూడా సాక్షాత్తూ అమెరికా బోర్డర్ పెట్రోల్ చీఫ్ గా ఉన్న మైఖేల్ డబ్ల్యూ బ్యాంక్సే పోస్ట్ చేశారు. పట్టుకున్న 104మంది భారతీయులను భారత్ కి యుద్ధ విమానం లో తిరిగి పంపే దృశ్యాలను రికార్డు చేశారు. ఈ విజువల్స్ భారతీయుల చేతికి సంకెళ్లు వేసి క్లియర్ గా కనిపిస్తున్నాయి. చేతికే కాళ్లకు కూడా గొలుసులు ఉండటం వాళ్లను జంతువుల్లా ట్రీట్ చేశారని స్పష్టం చేస్తున్నాయి. ఇదంతా భద్రత కోసమే అమెరికా చేసిందని వాళ్లు సర్ది చెప్పేందుకు కూడా వీలు లేకుండా అమెరికా బోర్డర్ పెట్రోల్ చీఫ్ చేసిన ఈ ట్వీట్ చూడండి. ఇల్లీగల్ ఏలియన్స్ ను ఇండియాకు సేఫ్ గా పంపిస్తున్నాం రాశారు. ఏలియన్స్ ఏంటీ..ఓ అధికారి దౌత్యపరమైన విషయాల్లో వాడాల్సిన భాష ఇది అస్సలు కానే కాదు. ఇప్పుడు ఈ వీడియో భారత్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారతీయులను అక్కడ ఎలా ట్రీట్ చేశారనే విషయాన్ని ఈ వీడియో స్పష్టం చేస్తోందంటూ ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.





















