Sringar's Lal Chowk Significance | జెండా కోసం పోరాడిన గడ్డ - శ్రీనగర్ లాల్ చౌక్ | ABP Desam
త్రివర్ణ పతాకపు రంగులతో మెరిసిపోతూ కనిపిస్తున్న ఈ లాల్ చౌక్ కశ్మీర్ లోని పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. శ్రీనగర్ లో ఉండే ఈ హిస్టారిక్ ప్లేస్ చాలా సంవత్సరాలు చాలా సెన్సిటివ్ ప్లేస్ కూడా. దేశానికి శిరస్సు లాంటి లాల్ చౌక్ ప్రాంతంలో ఒకప్పుడు ఇక్కడ బయట తిరగాలంటేనే భయపడేవాళ్లమని..కనీసం మన జాతీయ పతకాన్ని ఎగురేసేందుకు కూడా వీలు లేని తీవ్రవాద దాడులకు ఈ ప్రాంతం నిలయంగా ఉండేదని...అలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు కనిపించటం లేదని స్థానికులు చెబుతున్నారు.శ్రీనగర్ లో ఉండే ఏ మతాలకు చెందిన వారైనా సరే లాల్ చౌక్ సమీపంలో దుర్గాదేవి ఆశీస్సులు కోసం వస్తుంటారు. ఇక్కడ కులమత భావన లేని జాతి సమైక్యతా రాగం వినిపిస్తూ ఉంటుంది. పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తూ అద్భుతమైన ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా ఇప్పుడు శ్రీనగర్ లాల్ చౌక్ విలసిల్లుతోంది. అసలు అక్కడి చరిత్ర ఏంటీ ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు. ఈ వీడియోలో చూసేయండి