Rahul Gandhi Stage collapses | రాహుల్ గాంధీ ఎన్నికల సభలో అపశృతి | ABP Desam
రాహుల్ గాంధీ ఎన్నికల సభలో ఓ అపశృతి చోటు చేసుకుంది. ఇండియా కూటమి తరపున బీహార్ లో ప్రచారం చేసేందుకు వెళ్లిన రాహుల్ పాలిగంజ్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఆర్జేడీ ఎంపీ మీసా భారతి తో కలిసి సభ నిర్వహించిన రాహుల్..ప్రజలకు అభివాదం చేసేందుకు లేచి నిలబడగానే సభావేదిక కూలిపోయింది. పక్కనే ఉన్న మీసా భారతి పడిపోకుండా రాహుల్ గాంధీ చేతిని గట్టిగా పట్టుకున్నారు. వెంటనే అప్రమ్రత్తమైన భద్రతా సిబ్బంది రాహుల్ ను కిందకి దిగిపోవాలని సూచించినా వారించారు. విరిగిన సభావేదిక నుంచి ప్రజలకు అభివాదం చేసేందుకు మరోసారి చేయి ఊపగా మరోసారి సభావేదిక కిందకి కుంగిపోయింది. ఈసారి భద్రతా సిబ్బంది రాహుల్ ను దిగిపోవాలని సూచించినా సెక్యూరిటీతో మాట్లాడారు రాహుల్ గాంధీ. సభావేదిక మొత్తం పడిపోయినా తను సభ పూర్తైన తర్వాత దిగుతానని ఖరాఖండీగా చెప్పేశారు. దీంతో కూలిన వేదిక మీదనే కుర్చీలు కొంచెం వెనక్కి జరిపి రాహుల్ కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.