Pak Army burnt Chowkibal Village House | సాధారణ పౌరులే టార్గెట్ పాక్ ఆర్మీ దుశ్చర్యలు | ABP Desam
భారత ఆర్మీ ఎప్పుడూ ధైర్యాన్ని, నైతికతను ముందుపెట్టేలా చర్యలు చేపడుతోంది. అవసరమైతే ప్రత్యక్షంగా శత్రు గడ్డలోకి వెళ్లి పోరాడే సాహసం భారత సైన్యం చూపుతోంది. అయితే ఇదే సమయంలో పాకిస్తాన్ మాత్రం చీకటి కోణాల్లో దెయ్యంలా దాక్కొని అమాయక ప్రజలపై దాడులు చేస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో చౌకీబల్ అనే గ్రామంలో ఇటీవల జరిగిన ఘటన అందుకు తేటతెల్లంగా నిదర్శనం. పాక్ సైన్యం జరిపిన అప్రకటిత కాల్పుల వల్ల ఆ గ్రామంలో ఉన్న సాధారణ పౌరుల ఇళ్లు మంటల్లో కాలిపోయాయి. కుటుంబ సభ్యులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటపడటం ఎంత భయానక అనుభవమో ఆ ఘటనలో స్పష్టమైంది. ఇంటిలో ఉన్న వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. ఆ మంటల మధ్య నుంచి బయటకు ఎగిరిన ఓ తెల్లటి పావురం ప్రతి ఒక్కరి గుండెను పిండేసింది. అది శాంతికి ప్రతీకగా కనిపించగా, పక్కనే ఇళ్లు కాలిపోతున్న దృశ్యం అందరినీ కలచివేసింది. కశ్మీరీ ప్రజలే ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ "సిగ్గుందా పాకిస్థాన్?" అని ప్రశ్నిస్తున్నారు. ప్రజల భద్రతను కాపాడాల్సిన స్థానంలో ఉన్న సైన్యం, ఇలాంటివి చేస్తే అది మనుషులపై కాదు – మానవతపై దాడి చేస్తోందనే అర్థం





















