రెండు కీలకమైన ఘట్టాల తర్వాత బీజేపీకి తలబొప్పి కట్టిందేంటీ?
అయోధ్యలో 500ఏళ్ల హిందువుల కల..రామ మందిర నిర్మాణం. దాన్ని నిజం చేసి చూపించారు ప్రధాని మోదీ. ఎన్నో అవాంతరాలు..అడ్డంకులు..కోర్టు కేసులు..వివాదాలు అన్నీ దాటుకుని భవ్యరామ మందిరం నిర్మాణం పూర్తైంది. రాముడి ప్రతిష్ఠ జరిగిపోయింది. దేశమంతా హ్యాపీ..హిందువులు, బీజేపీ ఇంకా హ్యాపీ. రాముడికి ఇన్నాళ్లకు ఓ నీడ దొరికింది అని. కానీ ఏమైంది. రామమందిరం నిర్మాణం పూర్తి చేసిన ఉత్సాహం తో లోక్ సభ ఎన్నికలకు దిగిన బీజేపీకి ఊహించని షాక్. అయోధ్య అసెంబ్లీ ఉన్న ఫైజాబాద్ లోక్ సభ నియోజకవర్గాన్ని ఇండీ కూటమిలోని సమాజ్ వాదీ పార్టీ కైవసం చేసుకుంది. అంటే ఇన్నేళ్ల కలను తీర్చిన అయోధ్య ప్రజలు చుట్టుపక్కల నియోజకవర్గాల వాళ్లు బీజేపీని తిరస్కరించారు ఇది ఊహించని షాక్ బీజేపికి. ఇప్పుడు ఈరోజు తాజాగా రెండో షాక్. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ను పూర్తిగా భారత్ చట్టాల పరిధిలోకి తీసుకువచ్చింది బీజేపీ. దీనికోసం ఎన్నో ఏళ్ల వ్యూహం రచించింది.