Delhi Water Crisis | ఢిల్లీలో హింసకు దారి తీస్తున్న నీటి సంక్షోభం | ABP Desam
ఢిల్లీ తాగు నీటి సంక్షోభం హింసాత్మక ఘటనలకు దారి తీసింది. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే మంచినీరు దొరకటం లేదంటూ ఆందోళన చేస్తున్న ప్రజలు..ఈ రోజు ఢిల్లీ జల శక్తి ఆఫీస్ పై దాడి కి దిగారు. చేతిలో తెచ్చిన కుండలను జల్ శక్తి ఆఫీసు అద్దాలపై విసిరి నానా విధ్వంసం చేశారు. అయితే ఈ విధ్వంసాలకు కారణం బీజేపీ అంటూ ఢిల్లీ మంత్రి, ఆప్ నేత ఆతిషి ప్రతి ఆరోపణలకు చేశారు. గుండాలను తీసుకువచ్చి ప్రభుత్వ కార్యాలయాలపై బీజేపీ దాడులు చేయిస్తోందని ఆతిషి ఆరోపించారు. హర్యానా నుంచి రావాల్సిన నీటి వాటాను రానివ్వకుండా అడ్డుకుంటారన్న ఆరోపించిన ఆమ్ ఆద్మీ పార్టీ...పైప్ లైన్ లను కావాలనే పగులగొట్టి నీరు వృథా అయ్యేలా చేస్తున్నారని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన ఢిల్లీ పోలీసులు పైప్ లైన్లను పరిశీలించారు. ఈశాన్య ఢిల్లీలోని యుమునా ఖదార్ ప్రాంతంలోని జల్ శక్తి పైపులైన్లను పరిశీలించి అంతా బాగానే ఉన్నట్లు ప్రకటించారు. పదిహేను రోజుల పాటు పైపులైన్ల దగ్గర పోలీసులు కాపలా కాస్తారని తెలిపారు.
![Maha Kumbh 2025 New Records | ప్రపంచ చరిత్రలో అతి పెద్ద వేడుకగా మహాకుంభమేళా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/dd622881fcf31cc420d7956493ed462c1739800988246310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![Chhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/3e206721507162d5dd609ca9d8bce97b1739720025687310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Delhi Railway Station Stampede Cause | ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘోర విషాదానికి కారణం ఇదే | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/fc2bd748b361f8354970be387cc17e0c1739719470375310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Delhi Railway Station Stampede | ఢిల్లీ రైల్వే స్టేషన్ లో పెను విషాదం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/58b6120e03134504a89a1d5a466dd72b1739719271861310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Pawan kalyan in Kumbakonam Swamimalai Visit | తమిళనాడు ఆలయాలను దర్శించుకుంటున్న డిప్యూటీ సీఎం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/13/4bd8f092001255a45cc3dbb8c0f5e4971739465064486310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)