Ahmedabad Plane Crash | కూలిన విమానం .. ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన
ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ171 విమానం అహ్మదాబాద్ లో టేకాఫ్ అయిన 32 సెకండ్లలోనే కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఈ అంతర్జాతీయ విమానం సిగ్నల్ కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ప్రమాదాన్నికి సంబంధించి ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన విడుదుల చేసింది.
అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఏఐ171 విమానం ప్రమాదానికి గురయింది. అహ్మదాబాద్ నుండి మధ్యాహ్నం 3.38 గంటలకు బయలుదేరిన బోయింగ్ 787-8 విమానంలో 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ వాళ్లు, 1 కెనడియన్, 7 పోర్చుగీస్ సిటిజన్స్ ఉన్నారు. ఈ ప్రమాదం నుండి బయట పడ్డ వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటిష్ సిటిజన్స్ అని తెలిపింది.
మృతుల కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలిపింది. అలాగే ఎయిర్ ఇండియా బృందాలు అహ్మదాబాద్ లోనే ఉన్నాయి అని.. అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లను కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలిపింది. ప్రమాదం జరగడానికి గల కారణాలకు సంబంధించి అధికారులకు ఎయిర్ ఇండియా పూర్తి సహకారాన్ని అందిస్తోందని ట్విట్టర్ వేదికగా తెలిపింది.





















