Helath Clinic in GraveYard: పుట్టపర్తి మున్సిపల్ స్మశాన వాటిక చుట్టూ రాజకీయం
పుట్టపర్తిలో హెల్త్ క్లినిక్ నిర్మాణం కోసం అనువైన స్థలం ఎక్కడా దొరక్కపోవడంతో శ్మశానం కోసం వదిలేసిన స్థలంలో నిర్మాణం ప్రారంభించారు. అయితే సమాదులను తొలగించి హెల్త్ క్లినిక్ నిర్మిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ స్థలం ఆక్రమించి ఇళ్ళు కట్టుకొన్నారని,వదిలేస్తే మిగిలిన ఇరవైసెంట్ల స్థలం కూడా ఆక్రమించే అవకాశం వున్నందునే ఇక్కడే హెల్త్ క్లినిక్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. వారం రోజులుగా ఈ విషయంపై పోలీసులకు కూడా తలనొప్పిగా మారింది.రోజకో పార్టీ నాయకులు ఆందోళన చేయడం,వారిని కంట్రోల్ చేయడం ఇదే పరిపాటిగా మారిందంటూ వాపోతున్నారు.పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన వ్యవహారం ఎప్పటికి ఆగుతుందో తెలియటం లేదని స్థానికులు అంటున్నారు.





















