Gudivada Casino : టీడీపీ నిజనిర్థారణ కమిటీ అరెస్ట్- నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానన్న మంత్రి కొడాలి
కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి పండగ సందర్భంగా ఒక కళ్యాణమండపంలో నిర్వహించిన కార్యకలాపాలపై తీవ్ర స్థాయిలో రాజకీయ దుమారం చెలరేగింది ..మంత్రి కొడాలి నాని నేతృత్వంలోనే ఆయనకు చెందిన కళ్యాణమండపంలో అసభ్య నృత్యాలు చేయించారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ విషయమై సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన వీడియోలు ఆధారంగా టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది ..ఈ కమిటీ గుడివాడలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి కళ్యాణ మండపం కూడా పరిశీలించేందుకు టిడిపి నేతలు ప్రయత్నించారు .అయితే టిడిపి నేతలు స్థానిక వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది .టీడీపీ నేతలను పోలీస్ లు అరెస్ట్ చేశారు. ఈ అంశంపై మంత్రి కొడాలి నాని కూడా స్పందించి టీడీపీ కి సవాల్ చేశారు .టీడీపీ తన ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు .పేకాట ఆడినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించారు. ఆత్మహత్య చేసుకుంటానన్నారు. ఇంతకీ కళ్యాణ మండపం లో పేకాట జరిగిందా...ఎవరు పాల్గొన్నారు... అనే విషయాలు పోలీసులు వెలుగులో తేవాల్సి ఉంది.