Fast And Furious Series : "ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10" లో ఆక్వామ్యాన్ స్టార్ జాసన్ మోమోవా
ప్రపంచవ్యాప్తంగా “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్” సిరీస్ కు ప్రత్యేక క్రేజ్ ఉంది. విన్ డీజిల్ తన టీంతో కలిసి చేసే ఆక్షన్ సీక్వెన్స్ లు సినిమా ప్రియులను మైమరిపిస్తాయి అనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. అయితే త్వరలో రాబోయే “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ పార్ట్ 10 గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా కనబరుస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10” నుంచి వచ్చిన ఓ కొత్త అప్డేట్ సంచలనం గా మారింది. ఈ మూవీలో ‘ఆక్వామ్యాన్’గా గుర్తింపు తెచ్చుకున్న జాసన్ మోమోవా కూడా చేరిపోయారు అనే వార్తలు ఇటీవల ప్రకటించారు. ఆయన ఇందులో విలన్ గా నటించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని 2023 మే 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.





















