Chennai NGT: రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపడితే ఏపీ ప్రభుత్వానిదే బాధ్యత
పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టొద్దని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(NGT) ఆదేశించింది. అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని చేపట్టవద్దని ఏపీ ప్రభుత్వానికి తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అధ్యయనానికి నలుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని ఎన్జీటీ తెలిపింది. ఈ కమిటీ 4 నెలల్లో ప్రాజెక్టుపై అధ్యయనం చేసిన తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ పూర్తి వ్యవహారంపై ఏపీ సీఎస్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు అవసరం లేదని తెలిపింది. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ చర్యలు అవసరం లేదని ఎన్‌జీటీ తెలిపింది. శుక్రవారం రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ విచారణ చేపట్టింది. పర్యావరణ ఉల్లంఘన జరిగితే రాష్ట్రానిదే బాధ్యతని పేర్కొంది