Chammak Chandra : చంద్రగిరి మూలస్థాన ఎలమ్మ దేవస్థానాన్ని దర్శించుకున్న హాస్యనటుడు చమ్మక్ చంద్ర
చంద్రగిరిలోని శ్రీ మూలస్థాన ఎల్లమ్మ అమ్మవారిని హస్యనటుడు చమ్మక్ చంద్ర కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.దర్శనాంతరం ఆయన మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురష్కరించుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నానని అన్నారు. చంద్రగిరి శ్రీ మూలస్థాన ఎల్లమ్మ మహిమలను గురించి తెలుసుకుని ఇక్కడి రావడం జరిగిందన్నారు. చిన్న పాత్రైనా అఖండ చిత్రం మంచి గుర్తింపు ఇచ్చిందన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా మంచి పాత్రలో నటించానన్నారు. సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల జబర్దస్త్ చేయలేక పోతున్నానని, అవకాశం వస్తే తప్పకుండా జబర్దస్త్ ప్రోగ్రామ్ చేస్తానన్నారు..
ట్రెండింగ్ వార్తలు






















