Brunei Sultan Daughter Marriage: 7 రోజుల పాటు జరిగిన బ్రూనై సుల్తాన్ కుమార్తె పెళ్లి విశేషాలు
బ్రూనై సుల్తాన్ కుమార్తె వివాహం అత్యంత వైభవంగా జరుగుతోంది. బ్రూనై సుల్తాన్ బోల్క్యా హస్సనల్ కుమార్తె ఫద్ జిల్లా పెళ్లి వేడుకలు ఏడురోజుల పాటు నిర్వహిస్తున్నారు. అవాంగ్ అబ్దుల్లా నబిల్ హషిమీతో జరుగుతున్న ఈ పెళ్లి వేడుకలను సంప్రదాయ పద్ధతిలో తమ ఆచారాలను అనుసరిస్తూ వారం రోజులపాటు చేయనున్నారు. ఇందుకోసం కొన్ని వందల కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి వధువు ధరించిన అత్యంత అరుదైన పచ్చరాళ్ల కిరీటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఆ కిరీటాన్ని బ్రూనై సుల్తాన్ వంశంలోని మహిళలు అతిపెద్ద వేడుకల్లో ధరించటం ఆనవాయితీగా వస్తోంది. బ్రూనై సుల్తాన్ నికర ఆస్తి విలువ రెండున్నర లక్షల కోట్ల రూపాయలు కాగా...ఈ మొత్తంలో నికరఆస్తి కలిగి ప్రపంచంలోనే అత్యంత ధనంవతుడిగా పేరు గడించాడు బ్రూనై సుల్తాన్.





















