Bloomberg Top20 Richest Asia Families : వరుసగా మూడో ఏడాది అగ్రస్థానం అంబానీలదే | ABP Desam
బ్లూమ్ బర్గ్ ఆసియాలోనే టాప్ 20 సంపన్న కుటుంబాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో వరుసగా మూడో ఏడాది అంబానీల కుటుంబానిదే అగ్రస్థానం. మొత్తం ఇరవై సంపన్న కుటుంబాల ఆస్తుల విలువ దాదాపు 37లక్షల కోట్ల రూపాయలుగా బ్లూమ్ బర్గ్ అంచనా వేసింది. జాబితాలో తొలిస్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ ఆస్తి విలువ 90 బిలియన్ డాలర్లు కాగా....రెండు, మూడు స్థానాల్లో ఇండోనేషియాకు చెందిన హర్ టోనో కుటుంబం, భారత్ కి చెందిన మిస్త్రీల కుటుంబం నిలిచాయి. ఇక ఈ జాబితాలో 18 స్థానంలో హిందూజాల కుటుంబం నిలవగా, 20 వస్థానంలో బజాజ్ కుటుంబం నిలిచింది. ఈ ఇరవై కుటుంబాల సంపాదన....హాంకాంగ్, సింగపూర్ మొత్తం జీడీపీ కంటే ఎక్కువని బ్లూమ్ బర్గ్ వెల్లడించింది.





టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

