Andre Russell Runout : ఊహించని చిత్ర విచిత్రం.. వెరైటీగా రసెల్ రనౌట్
ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. ఈ టోర్నీ లీగ్ మ్యాచ్ ల్లో భాగంగా ఓ వింత రనౌట్ చోటు చేసుకుంది. మినిస్టర్ గ్రూప్ ఢాకా టీం తరఫున ఆడుతున్న ఆండ్రె రసెల్... తిసార పెరీరా బౌలింగ్ లో ఓ షాట్ కొట్టి సింగిల్ కు పరిగెత్తాడు. బ్యాక్ వర్డ్ పాయింట్ లోని ఫీల్డర్... బ్యాట్సమన్ ఎండ్ వైపు త్రో విసిరాడు. ఇంకోవైపు పరిగెత్తుతున్న రసెల్... తన వైపు బాల్ రాదులే అనుకుని కాస్త లేజీగా పరిగెత్తాడు. కానీ ఎవరూ ఊహించని విధంగా బ్యాట్సమన్ ఎండ్ వైపున్న స్టంప్స్ ను తాకిన బాల్... బౌలర్ ఎండ్ స్టంప్స్ వైపు వచ్చి వాటిని పడగొట్టింది. అదే సమయానికి రసెల్ క్రీజు బయట ఉండటంతో ఔట్ గా తేలాడు. ముందు బ్యాట్సమన్ ఎండ్ వైపు బెయిల్స్ కింద పడ్డా, అప్పటికే క్రీజులోకి అతను వచ్చేయటంతో నాటౌట్ గా తేలాడు. రసెల్ ఆశ్చర్యకర రీతిలో పెవిలియన్ దారి పట్టాడు.





















