America- Canada Border: 4 భారతీయులు మృతి.. పర్మిషన్ లేకుండా వెళ్లినందుకే ఇలా అయ్యిందా?
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఓ భారతీయ కుటుంబం ప్రయత్నించింది. అమెరికా- కెనడా సరిహద్దుల్లో వచ్చిన తుఫాను వల్ల చలికి గడ్డకట్టుకుని ఆ కుటుంబమంతా మరణించారు. వీరు గుజరాత్ కు చెందిన వారిగా కెనడియన్ అధికారులు గుర్తించారు. ఇటీవలే అగ్రరాజ్యంలోకి చొరబడినందుకు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు మంచులో కూరుకుపోయి అత్యంత దారుణమైన స్థితిలో వీరి మృతదేహాలు కనిపించినట్లు అధికారులు తెలిపారు. సరిహద్దుకు చేరుకునే ముందు కొద్ది రోజులు వీరంతా కెనడాలోని పలు ప్రాంతాల్లో సంచరించినట్లు దర్యాప్తులో తేలింది. వీరి వెనుక కచ్చితంగా మానవ అక్రమ రవాణా ముఠా ఉండి ఉంటుందనే అనుమానం లేకపోలేదు. మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.





















