PM Modi Meditates At Vivekananda Rock Memorial | ధ్యానంలో మోదీ..బీజేపీ లెక్కలు ఇవేనా..?
గురువారం సాయంత్రం 6.45 గంటల సమయంలో మోదీ ధ్యానం ప్రారంభించారు. శనివారం వరకు ఈ ధ్యానం కొనసాగుతుంది. ఈ సమయంలో ఫుడ్ తీసుకోరు. కేవలం లిక్విడ్స్ తీసుకుంటారు. కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసమే తీసుకుంటారు. ఈ 45 గంటల సమయం పాటు ఆయన మెడిటేషన్ హాల్ నుంచి బయటికి రారు. కాషాయ దుస్తుల్లోనే ఉంటారు. ఫోన్, టీవీ ఏమి ఉపయోగించరు. ఎవరిని కలవరు కూడా.
2019లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన కేదార్‌నాథ్ వద్ద గుహల్లో ఇలాగే ధ్యానం చేశారు.కానీ ఈ సారి కన్యాకుమిరినే ఎందుకు ఎంచుకున్నారు అన్నది తెలియాలంటే కాస్త చరిత్రలోకి వెళ్లాల్సిందే..!కన్యాకుమారిలోని వావవతురై బీచ్‌కి 500 మీటర్ల దూరంలో ఉందీ రాక్ మెమోరియల్. హిందూ మహా సముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం కలిసే ఈ చోట దీన్ని నిర్మించారు. 1892లో ఈ ప్రాంతంలోనే స్వామి వివేకానంద ఓ రాయిపై ధ్యానం చేసుకున్నారు. మూడు రోజులు, మూడు రాత్రుల పాటు ఇక్కడే ధ్యానంలో ఉన్నారు. ఇక్కడ ధ్యానం చేసుకున్న తరవాత ఆయనకు జ్ఞానోదయం అయిందని చెబుతారు. ఆయన తన సిద్ధాంతాలకు తుది రూపు తీసుకొచ్చింది కూడా ఇక్కడే. ఈ ప్రాంతం గురించి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో 1963లో RSS కార్యకర్త ఏక్‌నాథ్ రనాదే వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మించాలని ప్రతిపాదించారు. 1970 నాటికి ఆ నిర్మాణం పూర్తైంది. అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి దీన్ని ప్రారంభించారు. ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టే ప్రధాని మోదీ ఇక్కడే ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నారు. వివేకానందుడిని రోల్‌మోడల్‌గా భావించే ప్రధాని నరేంద్ర మోదీ రామకృష్ణ మిషన్‌లో సభ్యులు కూడా.
![Pawan kalyan in Kumbakonam Swamimalai Visit | తమిళనాడు ఆలయాలను దర్శించుకుంటున్న డిప్యూటీ సీఎం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/13/4bd8f092001255a45cc3dbb8c0f5e4971739465064486310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![Mukesh Ambani Family Holy Dip Maha Kumbh 2025 | కుంభమేళాలో అంబానీల పవిత్రస్నానం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/12/9d6cb07981c289f6f761e818308865631739375975073310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![President Murmu in Maha kumbh 2025 | మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/10/fb52a322059d792a4f9d240af27732521739193779240310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Rahul Gandhi with Nagaland Students | మనం మైండ్ సెట్స్ ను ఇక్కడే ఆపేస్తున్నారు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/09/80e7a64db4fa8ce2aac9eab10933973b1739093902115310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![AAP Loss Yamuna Pollution Key Role | Delhi Election Results 2025లో కేజ్రీకి కలిసి రాని యమున | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/08/e3a66b194c44440e3f77baabd00e057c1739025148906310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)