Simple Yoga for Body Fat | చెడు కొవ్వును సింపుల్ యోగాసనాలతో దూరం చేయండి
ఈరోజుల్లో అధికబరువు ప్రధాన సమస్యగా మారింది. గంటల తరబడి ఒకేచోట కూర్చుని పనిచేయడంతోపాటు ,శరీరానికి అవసరమైన వ్యాయామం చేసే సమయం లేకపోవడం అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. విపరీతమైన పనిఒత్తిడి ప్రభావంతో చిన్న వయస్సులోనే ఊబయకాయం, అధిక కొలెస్ట్రాల్, వయస్సుకు మించిన బరువు వంటి సమస్యలు సర్వసాధారణంగా మారాయి. ఎటువంటి మందులు వాడకుండా ఈ వీడియోలో చూపిన ఆసనాలకు రోజూ కాస్త సమయం కేటాయించి ప్రాక్టీస్ చేయడం ద్వారా అధిక బరువు సమస్యను ఇట్టే అధిగమించవచ్చు. ఊబకాయం వల్ల ఎదురైయ్యే అనారోగ్య సమస్యల నుండి వేగంగా బయటపడవచ్చు. ఒక్కో వ్యాధికి యోగాలో ఒక్కో ప్రత్యేక ఆసనాలున్నాయి. మీరు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలకు అవసరమైన యోగాసనాలను తెలుసుని ,రోజులో కాస్త సమయం కేటాయించి యోగాను ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి ఫలితం లభిస్తుంది.ధీర్గకాలిక వ్యాధులకు మీరు రోజూ వాడుతున్న మెడిసిన్ డోస్ తగ్గించుకోవడమేకాదు, నెమ్మదిగా వ్యాధులను పూర్తిగా అదుపుచేసే అవకాశాలు కూడా ఉన్నాయి.





















