Merck Corona Pill : కరోనాపై పోరాటంలో కీలక విజయం.... వైరస్ కట్టడికి టాబ్లెట్లు తయారీ
ప్రపంచాన్ని రెండేళ్లుగా తన గుప్పిట్లో బంధించి ఊపిరాడకుండా చేస్తోంది కరోనా. జనజీవనాన్ని స్తంభించేలా చేసిన మహమ్మారి అంతానికి ఏడాదిన్నరగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ పరిశోధనల ఫలితంగా ఎన్నో టీకాలు తయారయ్యాయి. ఆ టీకాల ద్వారా కరోనా నుంచి కొంతవరకు రక్షణ పొందవచ్చు. ప్రాణాంతక పరిస్థితి వరకు వెళ్లకుండా అడ్డుకుంటుంది టీకా. టీకాలతోనే సరిపెట్టాలనుకోలేదు శాస్త్రవేత్తలు దాని అంతానికే పూనుకున్నారు. అలాంటి పరిశోధన ఫలితంగా తొలిసారి ఒక టాబ్లెట్ ను కరోనా అంతానికి తయారుచేశారు. కరోనాకు వ్యతిరేకంగా తయారుచేసిన తొలి మాత్ర ఇది. ఈ మాత్రకు బ్రిటన్ ఔషధాల నియంత్రణ సంస్థ ఆమోదించింది. అంటే ఇక ఆ దేశంలో ఆ టాబ్లెట్లను ప్రజలు వినియోగిస్తారు.





















