(Source: ECI | ABP NEWS)
Benarjee Tears: కొట్టబోయారంటూ కన్నీళ్లు పెట్టుకున్న మా సభ్యుడు బెనర్జీ
‘మా’ ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడి గెలిచి కూడా ప్రకాష్ రాజ్ ప్యానల్ తమ పదవుల్ని తృణప్రాయంగా త్యజించేసింసి. అయితే ఈ విషయం ప్రకటించడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ నటులు బెనర్జీతో పాటు ఉత్తేజ్, తనీష్ లాంటి వారు కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా బెనర్జీ అయితే కన్నీటిని ఆపుకోలేకపోయారు. బాగా ఎమోషనల్ అయ్యారు.
అయితే పోలింగ్ రోజున మోహన్ బాబు ఆయనను చంపేస్తానని బెదిరించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఆ సందర్భంగా ఏం జరిగిందో బెనర్జీ వివరించారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు .. గొడవలు వద్దని చెప్పడానికి తాను వెళ్లానని అన్నారు. అయితే అనూహ్యంగా మోహన్ బాబు తనపై దాడికి వచ్చారని.. ఇష్టమొచ్చినట్లుగా బూతులు తిట్టారని ఆవేదన చెందారు.





















