SP Balu Tribute: బాలు.. నువ్వూ.. నీ పాట అజరామరం.. దివ్యగళం మూగబోయి ఏడాది
SP Balu Death Anniversary: అమృతం తాగిన వారు.. దేవతలు... దేవుళ్లు.. ! అని బాలూ పాడారు. అమృతం తాగితే.. చిరంజీవులు అయిపోతే.. నా పాట పంచామృతం అంటూ.. మనందరికీ ప్రతిరోజూ.. గానామృతాన్ని పంచే బాలసుబ్రమణ్యం అంతకంటే ఎక్కువ యశస్సును... చిరాయష్షును పొందుతారు కదా.. బాలూ దూరమైనప్పుడే ఆయన అభిమానులు అనుకున్నారు.. బాలూకు మరణం ఏంటని... పాటను బాలూను ఎలా వేరు చేస్తామని..! అందుకే ఆయన లేరు కానీ.. ఆయన పాట అలాగే ఉంది. పెద్దవాళ్లు పాడుకునే భక్తి పాటల్లో... మహిళలు మననం చేసుకునే మంచిపాటల్లో ..మధ్య వయసు వాళ్లు గుర్తు చేసుకునే హుషారు పాటల్లో .. మనసుల్లో ... మాటల్లో ..ఊహల్లో.. ఇళ్లలో ..టీవీల్లో ..కార్లలో... ఫోన్లలో ఇలా ప్రతీ చోటా బాలూనే.. అసలు బాలూ లేనిదెక్కడ.. ! పాటల తోటమాలి సెలవు తీసుకుని సంవత్సరం అయింది. అవును శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం తొలి వర్థంతి నేడు..!