Nandamuri Balakrishna on Gangs of Godavari Event | గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్ లో బాలకృష్ణ | ABP
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వక్ సేన్ సహా టీమ్ అంతటినీ ప్రశంసలతో ముంచెత్తారు బాలయ్య. యంగ్ హీరో విశ్వక్ సేన్ మరోసారి తనకు బాగా కలిసొచ్చిన మాస్ ఫార్ములాను ఫాలో అవుతూ నటించిన సినిమానే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ నుంచి పలుమార్లు పోస్ట్‌పోన్ అవుతూ వస్తోంది. ఫైనల్‌గా మే 31న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ డేట్‌కు ఇంకా కొన్నిరోజులే సమయం ఉండడంతో మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్ విషయంలో బిజీ అయిపోయింది. అందులో భాగంగానే విశ్వక్ సేన్ కూడా ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు బయపెట్టాడు. దీంట్లో తను ఎన్ని రిస్కులు తీసుకున్నాడో చెప్పాడు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ గురించి బాలకృష్ణ చెప్పిన విషయాలు ఈ వీడియోలో.