Hero Karthi Upcoming Movies | సీక్వెల్ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టిన హీరో కార్తీ
తమిళ హీరో కార్తి వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. సత్యం సుందరం సినిమాతో డీసెంట్ హిట్ అనుకున్న హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. కొని షూటింగ్ స్టేజ్ లో ఉంటె మరికొన్ని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయి. ముసలివాడి క్యారెక్టర్ తో సర్దార్ సినిమా చేసి అందర్నీ మేపించాడు. ఈ సినిమాకి కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. దాంతొ ఈ సినిమా సీక్వెల్ కి రెడీ అయిపొయ్యారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సర్దార్ 2’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ మూవీ డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఖైదీ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కార్తీ కెరీర్ లోనే ఈ సినిమా ది బెస్ట్ అని చెపొచ్చు. ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉందని ఆల్రెడీ అనౌన్స్ కూడా చేసారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ‘ఖైదీ 2’ ప్రారంభం కానుంది. ‘హిట్’ సిరీస్ లో కూడా భాగమైపోయ్యారు కార్తీ. డైరెక్ట్ గా తెలుగులో కార్తీ చేయబోయి మొదటి సినిమా ‘హిట్ 4’. ఈ విషయాన్ని ఆల్రెడీ హిట్ 3 లోనే చెప్పేసారు.
డ్రీమ్ వారియర్స్ బ్యానర్‌పై తన 29వ మూవీ సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రానుందట. ఇలా వరుసగ సీక్వెల్ సినిమాలు లైన్ లో పెట్టారు హీరో కార్తీ. ఇప్పటికే సీక్వెల్‌గా స్టార్ అనిపించుకుంటోన్న కార్తి ఖాతాలోకి మరో సీక్వెల్ ప్రాజెక్ట్ చేరింది. ఇలా వరుస సీక్వెల్స్ ని ప్లాన్ చేసిన కార్తీ హిట్ కొడతారా లేదా అన్న క్వశ్చన్ మొదలయ్యింది. సాధారణంగా ఒక హీరో తన సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేసారంటే ఎంతో హైప్ ఉంటేకానీ ఫ్యాన్స్ థియేటర్ కి వెళ్ళరు. మరి ఇలా ఒకే హీరో ఇన్ని సినిమాలు సీక్వెల్ ప్లాన్ చేస్తే ఫ్యాన్స్ థియేటర్స్ కి వస్తారో లేదు చూడాలి.





















